రాజానగరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలోని సెక్యూరిటీ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. ఈ రోజు రాజానగరంలో సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ కాకినాడ నుంచి సభా ప్రాంగణానికి వస్తుండగా రంగంపేట మండలంలోని రామేశంపేట వద్ద ఆయన ప్రైవేటు భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్ ఆస్పత్రిలో చేర్పించారు. పవన్ ప్రయాణిస్తున్న వాహనం ముందే సభా వేదిక వద్దకు వెళ్తుండగా.. ఆ తర్వాత వెళ్తున్న ప్రైవేటు భద్రతా సిబ్బంది వాహనం ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిలో శివ, నవీన్, పి. అరవింద్, కె.శ్రీకాంత్, జె.రామకిశోర్, జావీద్, బాబి, బి. శ్రీకాంత్ ఉన్నారు. చిన్నపాటి గాయాలతోనే వారు బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
0 comments:
Post a Comment