ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ చేయనున్న విషయం తెలిసిందే. అంటే ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులు ఇంజినీరింగ్, ఎంబీఏ చదువుతున్న విద్యార్థుల సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే కావాల్సినంత మంది తమకు లభించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 3,090 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒకరు వెబ్‌కాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే 3,090 మంది అవసరమవుతారు. రంగారెడ్డిజిల్లా పరిధిలోని మొత్తం 8 నియోజకవర్గాల్లో 3,090 మంది వెబ్‌కాస్టింగ్ కోసం అవసరముంటే ఇప్పటి వరకూ 1,200 మంది మాత్రమే లభించారు. మిగిలిన వారు కూడా అధికారులను కలిస్తే వారికి కూడా వెబ్‌కాస్టింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు.
ల్యాప్‌టాప్‌తో రావాలి..
* వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొనాలకునే ఇంజినీరింగ్, ఎంబీఏ విద్యార్థులు 6, 7వ తేదీల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.
* తమ వెంట ల్యాప్‌టాప్ తెచ్చుకోవాలి.
* సీసీ కెమెరాను అధికారులే ఇస్తారు.
* ఎన్నికల రోజు కెమెరాలో పోలింగ్ కేంద్రంలోని పరిస్థితులను బంధించి పోలింగ్ పూర్తవగానే పెన్‌డ్రైవ్‌లో నిక్షిప్తం చేసి అధికారులకు ఇవ్వాలి.
* వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొన్నందుకు విద్యార్థులకు రూ.900 చెల్లిస్తారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొన్నందుకు ధ్రువీకరణ పత్రం కూడా ఇస్తారు. వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులు లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఎన్నికల నోడల్ అధికారిని సంప్రదించవచ్చు. అలాగే వివిధ నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులను కలసి వివరాలు తెలుసుకోవచ్చు..
మరిన్ని వివరాలకు చరవాణి నం: 79977 25236కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
Loading...
0 comments:
Post a Comment