పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతుంది. నవ దర్శకుడు, ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్‌మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.ఆయన సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుంది. రీసెంట్ అయోగ్య అనే టైటిల్‌తో చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇందులో విశాల్ పోలీస్ జీపుపై కూర్చొని, చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఉన్నారు. ఈ ఫస్ట్‌లుక్ చూసి విశాల్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. కాని సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మాత్రం ఈ పోస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ పార్టీ పట్టాలి మక్కల్ కచ్చి(పీఎంకే) అధినేత డాక్టర్ ఎస్.రామదాస్.. విశాల్‌పై విరుచుకుపడుతున్నారు.బాధ్యాయుతమైన పదవిలో ఉండి ఈ పోస్టర్ ద్వారా విశాల్ తన అభిమానులకు ఏం సందేశం ఇస్తున్నారని రామదాస్ ప్రశ్నించారు. సినిమాల్లో ధూమపానాన్ని నిషేధించాలని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్‌కు గతంలో లేఖ రాసినట్లు ఈ సందర్భంగా రామదాస్ గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు ఆయనే స్వయంగా బీర్ బాటిల్ పట్టుకుని ఫస్ట్‌లుక్‌లు విడుదల చేయడమేంటని రామదాస్ ప్రశ్నించారు. ఇటీవల విజయ్ సర్కార్ పోస్టర్‌పై కూడా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మరి తాజా వివాదంపై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అయోగ్య చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తిచేసి జనవరిలో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.
0 comments:
Post a Comment