బయోపిక్‌లు తెరకెక్కించడం అంత సులభమేం కాదు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పి, అప్పటి వాతావరణ పరిస్థితుల్ని మళ్లీ సృష్టించాలి. ఆనాటి పాత్రల్ని మరోసారి కళ్ల ముందు తీసుకురావాలి. ‘ఎన్టీఆర్’ కథని తెరపైకి తీసుకొస్తున్నప్పుడు క్రిష్ ముందున్న సవాళ్లు ఇవే. ఏ పాత్రలో ఎవరు కనిపిస్తారు? ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తించాయి. చిత్రబృందం కూడా ఒకొక్క పేరునీ ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పుడు మొత్తం జాబితా బయటకు వచ్చేసింది. ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని ‘ఎన్టీఆర్’ బృందం అధికారికంగా ప్రకటించింది. రెండు భాగాలూ కలిపితే ఏకంగా 55 పాత్రలు కనిపించాయి. ఆయా పాత్రల్లో సుప్రసిద్ధమైన నటీనటులు కనిపించనున్నారు. కొంతమంది దర్శకులకూ మేకప్ వేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకూ కొన్ని పాత్రల్ని అప్పగించారు. అన్నట్లు క్రిష్ కూడా ఓ పాత్రలో తెరపై కనిపించనున్నారు. కొన్ని కీలకమైన పాత్రలను ఎవరెవరు పోషిస్తున్నారో చెప్పే చిత్రమాలిక ఇది.
మరికొన్ని పాత్రల్లో...

మురళీ శర్మ (చక్రపాణి), ఎన్.శంకర్ (విఠలాచార్య), దగ్గుబాటి రాజా (నందమూరి త్రివిక్రమరావు), పూనమ్ బజ్వా (లోకేశ్వరి), మంజిమా మోహన్ (భువనేశ్వరి), గారపాటి శ్రీనివాస్ (సాయికృష్ణ), హిమన్సీ (పురంధేశ్వరి), హీరోషిని కోమలి (ఉమా మహేశ్వరి), రోహిత్ భరద్వాజ్ (నందమూరి రామకృష్ణ), గిరీష్ (రామోజీరావు), ఈశ్వర్‌బాబు (ఎస్వీ రంగారావు), మండలి బుద్ధ ప్రసాద్ (మండలి వెంకట కృష్ణారావు), జిషు సేన్‌గుప్త (ఎల్వీ ప్రసాద్), నరేష్ (బీఏ సుబ్బారావు), శుభలేఖ సుధాకర్ (పి.పుల్లయ్య), సాయిమాధవ్ బుర్రా (పీతాంబరం), శివశంకర్ మాస్టర్ (వెంపటి చిన సత్యం), రవిప్రకాష్ (యోగానంద్), ఇంటూరి వాసు (తాతినేని ప్రకాశరావు), సురభి జయచంద్ర (టి.వెంకటరాజ), భద్రం (పేకేటి శివరాం), సంజయ్ (పింగళి), దేవి ప్రసాద్ (గుమ్మడి), ప్రత్యూష (జి.వరలక్ష్మి), నాగేశ్వరరావు (పుండరీకాక్షయ్య), సుప్రియా వినోద్ (ఇందిరాగాంధీ), రామజోగయ్యశాస్త్రి (సినారె), సికిందర్ (ఎం.జి. రామచంద్రన్), సునీల్ కుమార్ రెడ్డి (కన్నప్ప), అవసరాల శ్రీనివాస్ (డి.వి. నరసరాజు), రఘు మాస్టర్ (సలీమ్ మాస్టర్), భరత్ రెడ్డి (దగ్గుబాటి వెంకటేశ్వరరావు), నాగరాజ్ (చలమేశ్వరరావు), వెన్నెలకిషోర్ (రుక్మాంగదరావు) పాత్రల్లో కనిపిస్తారు.

0 comments:
Post a Comment