అమరావతి: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో ఆ పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో గ్లాసు గుర్తు ఫొటో షేర్ చేసి తమ కామెంట్లు జత చేస్తున్నారు. పనిలో పనిగా మరికొందరు పవన్ కల్యాణ్ వివిధ సందర్భాల్లో గాజు గ్లాసులో టీ తాగుతున్న ఫొటోలను ఉంచారు.
చిరంజీవి నటించిన మృగరాజు సినిమాలోని ‘ఛాయ్ చటుక్కున తాగరా భాయ్’ వీడియోను, ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ‘సామాన్యుడి నుంచి సంపన్నుల వరకూ అందరి దాహం తీర్చే గ్లాస్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పార్టీ గుర్తు లేదని ఇన్నాళ్లూ బాధ పడుతున్న జనసైనికులు.. ఇప్పుడు గుర్తు కేటాయింపుతో నేరుగా కార్యాచరణలోకి దిగారు. గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతుగా సోషల్ మీడియా వేదికగా ప్రయత్నాలు ప్రారంభించారు.
0 comments:
Post a Comment