వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ జాన్‌దివాకర్ తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్‌కు చెందిన కుంట మోహన్‌రెడ్డి– భారతి దంపతుల కుమారై సోనికారెడ్డి(31)కి మూడేళ్ల క్రితం భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్‌రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లయ్యాక దంపతులు కొంత కాలం బాగానే ఉన్నారు.
ఆ తర్వాత భర్త ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో కుంగిపోయిన సోనిక ఇటీవలే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. కాగా బుధవారం శాస్త్రినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తెలిసిన బంధువులను కలిసివస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సోనిక ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు పైకి ఎక్కి చెప్పులు, చేతిసంచి, చున్నీని అక్కడే వదిలేసి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా భవనంపైన కూల్‌డ్రింక్ సీసా ఉండడంతో ఏదైనా రసాయనం కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతియ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
0 comments:
Post a Comment