Monday, 4 March 2019

118 మూవీ రివ్యూ

118 మూవీ రివ్యూ

కెరీర్‌ను మలుపు తిప్పే బిగ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్‌, హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమా కూడా మెప్పింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. మరి ఆ అంచనాలను 118 అందుకుందా.? ఈ సినిమాతో కల్యాణ్ రామ్‌ మరో సక్సెస్‌ సాధించాడా?

కథ‌ :

గౌతమ్‌ (కల్యాణ్ రామ్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ను ఓ కల బాగా డిస్ట్రబ్‌ చేస్తుంది. కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్‌ ఆ కల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో గౌతమ్‌కు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు గౌతమ్‌ కలలో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్‌ చేశాడు? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :

జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్‌ రామ్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. గతంలో ఇజం సినిమాలో రిపోర్టర్‌ గా కనిపించిన కల్యాణ్‌ రామ్‌ ఈ సారి స్టైలిష్‌ పాత్రలో మరింతగా మెప్పించాడు. పర్ఫామెన్స్‌, యాక్షన్‌ సీన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. థ్రిల్లర్ సినిమా కావటంతో రొమాన్స్‌, డ్యాన్స్‌లకు  పెద్దగా స్కోప్‌ లేదు. నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా తన మార్క్‌ చూపించింది. హీరోయిన్‌ షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది. ఇతర పాత్రల్లో హరితేజ, ప్రభాస్‌ శ్రీను, నాజర్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌ :

సినిమాటోగ్రాఫర్‌గా టాలీవుడ్‌కు సుపరిచితుడైన కేవీ గుహన్‌, 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన గుహన్‌ లాంగ్ గ్యాప్‌ తరువాత తెలుగు సినిమాతో మరోసారి మెగా ఫోన్‌ పట్టుకున్నాడు. రొటీన్‌ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్‌ఫిక్షన్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంట్రస్టింగ్ పాయింట్‌ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను ఇరికించకుండా సినిమా అంతా ఓకె మూడ్‌లో సాగటం ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌ హాఫ్ రేసీ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ సీన్స్‌తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్‌ను పక్కన పెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. సినిమాటోగ్రఫి పరంగా మాత్రం గుహన్ ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. స్టైలిష్‌ టేకింగ్‌తో మెప్పించాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Blogger Templates
Scroll To Top