Latest

Wednesday, 19 December 2018

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ‘గ్రూప్‌ ఎక్స్‌, గ్రూప్‌ వై ట్రేడు’ల్లో ఉద్యోగాలకు ఆహ్వానిస్తోంది


కనీస అర్హత ఇంటర్‌/ డిప్లొమా
ఇంటర్‌, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారికి భారత వైమానిక దళం (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌) ‘గ్రూప్‌ ఎక్స్‌, గ్రూప్‌ వై ట్రేడు’ల్లో ఉద్యోగాలకు ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారు ఆయా విభాగాల్లో ఫిట్టర్‌ లేదా టెక్నీషియన్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభించి మాస్టర్‌ వారంట్‌ ఆఫీసర్‌ స్థాయికి చేసుకోవచ్చు. 
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ చదువుకున్న విద్యార్థులు గ్రూప్‌- ఎక్స్‌,  గ్రూప్‌- వై రెండు ఉద్యోగాలకూ అర్హులే. వీరు ఎక్స్‌ , వై ల్లో నచ్చిన గ్రూప్‌ కోసం దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసుకోవచ్చు లేదా రెండు గ్రూప్‌లకూ కలిపి నిర్వహించే పరీక్షనూ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాలి. డిప్లొమా విద్యార్థులు గ్రూప్‌- ఎక్స్‌ పోస్టులకే అర్హులు. 
గ్రూప్‌- ఎక్స్‌ ఉద్యోగాలకు ఇంటర్‌ / ప్లస్‌ 2 మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌లతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా 50 శాతం మార్కులతో ఏదైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసినవారూ అర్హులే. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. డిప్లొమాలో ఇంగ్లిష్‌ సబ్జెక్టు లేకపోతే ఇంటర్‌ లేదా పదో తరగతి ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. గ్రూప్‌- వై కొలువులకు ఇంటర్‌ ఏదైనా గ్రూప్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైవుండాలి. ఇంగ్లిష్‌లోనూ 50 శాతం మార్కులు ఉండాలి. ఈ గ్రూప్‌లో మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ పోస్టులకు మాత్రం ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్‌లోనూ 50% మార్కులు తప్పనిసరి. 
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే జనవరి 19, 1999 - జనవరి 1, 2003 మధ్య జన్మించివుండాలి. ఎత్తు కనీసం 152.5 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చకముందు, పీల్చిన తర్వాత ఛాతీ వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి. దృష్టిదోషం ఉండరాదు. వినికిడి సామర్థ్యం స్పష్టంగా ఉండాలి. ఫేÆజ్‌ 1, ఫేజ్‌ -2 పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫిట్‌నెస్‌ టెస్ట్‌

ఫేజ్‌ -1 పరీక్ష జరిగిన 25 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. ఎంపికైనవారు నిర్దేశిత ఎయిర్‌మెన్‌ సెలక్షన్‌ సెంటర్‌ వద్దకు చేరుకోవాలి. ప్రవేశపత్రాలతోపాటు అవసరమైన సర్టిఫికెట్లు, వాటి నకళ్లు, ఫొటోలు, సామగ్రిని తీసుకెళ్లాలి. అభ్యర్థులు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని ఆరున్నర నిమిషాల్లో పూర్తిచేయాలి. అలాగే నిర్ణీత వ్యవధిలో 10 పుష్‌అప్స్‌, 10 సిట్‌అప్స్‌, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ)లో అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు-1 నిర్వహిస్తారు. అభ్యర్థి ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగానికి సరిపోతాడో లేదో తెలుసుకోవడానికి ఆబ్జెక్టివ్‌ తరహాలో రాతపరీక్ష ఉంటుంది. టెస్టు -1లో అర్హత సాధించినవారికి టెస్టు 2 నిర్వహిస్తారు. ఇందులో మిలటరీ వాతావరణానికి అభ్యర్థి అలవాటు పడగలడో లేదో పరిశీలిస్తారు. ఇక్కడా ఉత్తీర్ణత సాధిస్తే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణ కోసం ఎంపికచేస్తారు. అక్టోబరు 31న మెరిట్‌ లిస్టు, శిక్షణకు ఎంపికైనవారి వివరాలు డిసెంబరు 10, 2019న ప్రకటిస్తారు.  
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: జనవరి 2, 2019 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 21, 2019 ఆన్‌లైన్‌ పరీక్షలు: మార్చి 14 నుంచి 17 వరకు. http://indianairforce.nic.in/

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Templateclue
Scroll To Top