Wednesday, 19 December 2018

గెస్ట్‌ హౌస్‌ సీజ్‌పై హైకోర్టుకు ప్రభాస్‌


తన అతిథి గృహం సీజ్‌ చేయడంపై సినీ నటుడు ప్రభాస్‌ స్పందించారు. తనకు నోటీసులివ్వకుండానే గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్‌ చేశారన్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ శివారు ప్రాంతం రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సినీహీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ అతిథిగృహం వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్‌ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Templateclue
Scroll To Top