బ్యాంకులో ఖాతా తెరవడానికి, మొబైల్ కనెక్షన్ పొందడానికి ఆధార్ మాత్రమే కావాలని ఒత్తిడి తెచ్చేవారికి ఇకపై రూ.కోటి వరకు జరిమానా, మూడేళ్ల నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించేందుకు వీలుంది.
ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించేవారికి రూ.50 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష పడేందుకు ఆస్కారం ఉంటుంది. ఆధార్ ద్వారా ధ్రువీకరణకు సమాచారం తీసుకునేటప్పుడు సంబంధిత వ్యక్తుల సమ్మతి పొందకపోతే రూ.10,000 జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. ఆధార్ గుర్తింపును, లేదా ఫోటోను అనధికారికంగా ప్రచురిస్తే రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు జరిమానా పడుతుంది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం చేయడానికి కేంద్ర మంత్రిమండలి ఇటీవల ఆమోదం తెలిపింది.
0 comments:
Post a Comment