స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ 64 మెగా పిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తోంది. శామ్‌సంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్‌తో అభివృద్ధి చేసిన ఈ కెమెరాతో తీసిన చిత్రాన్ని కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు.
మొదటిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేస్తారు. ప్రపంచంలో తొలిసారిగా 64 మెగా పిక్సెల్ కెమెరాను పొందుపరిచిన స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం. శామ్‌సంగ్ టెట్రాసెల్ టెక్నాలజీతో తయారైన ఈ కెమెరాతో తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన చిత్రాలను తీయవచ్చు.
వెనుకవైపు నాలుగు కెమెరాలు పొందుపరిచారు. కాగా, రియల్‌మీ జనవరి– మార్చి కాలంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 7.25 శాతం వాటా దక్కించుకుంది. డిసెంబర్ నాటికి 12–15 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుంది.
0 comments:
Post a Comment